Saturday, April 09, 2005

ఉగాది పచ్చడి

ఇది మా అమ్మ ఉగాది పచ్చడి విధానం
======================
-- వేప పువ్వు కడిగి , నీళ్ళు వంచి , నీళ్ళు తడి ఉండేటట్లు ఉంచండి.
-- చింతపండు నిమ్మకాయంత (=sphear of 3cm diameter) 10 నిమిషములు నానపెట్టి రసం తీయండి.
-- చింతపండు రసంలో నోటికి తీపి తగిలేంత బెల్లం కలపండి.
-- 1 మామిడి కాయ చిన్న ముక్కలు తరిగి రసం లో వేయండి.
-- 6 అరటి పళ్ళు చక్రాలుగా తరిగి రసంలో వేయండి.
--1/4 స్పూను ఉప్పు రసంలో కలపండి.
-- వేప పువ్వు రసంలో కలపండి.
-- మిరియాల పొడి కలపండి.
--మీకు కావలసినవి కలప వచ్చు .
ఉగాది శుభాకాంక్షలు.

0 Comments:

Post a Comment

<< Home